ADB: గుడిహత్నూర్ మండలంలోని దామన్గూడ గ్రామంలో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ గురువారం పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని హామీ ఎంపీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవి, రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ గంగాధర్ రావు, రమణ, ముకుందరావు, తదితరులు పాల్గొన్నారు.