ATP: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సంక్రాంతి పండుగ రోజు ప్రజలందరికీ నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో ఆదివారం సీపీఎం నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తక్షణమే సంక్రాంతి కానుక కిట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశాడు.