TG: రహదారి విస్తరణలో నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని.. నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందని చెప్పారు. రేషన్ కార్డుల్లో మార్పులు, కొత్త కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. రూ.600 కోట్లతో రామగుండం అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.