ATP: జిల్లా స్థాయి వైసీపీ గ్రామ, వార్డు కమిటీల నిర్మాణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రీజనల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి హాజరయ్యారు. పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కార్యకర్తలే పార్టీకి బలమని, అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.