SRCL: బ్రాహ్మణులపై దాడులు పెరగిపోతున్నాయని ఓ సంస్థ చీఫ్ కో- ఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాస్ అన్నారు. వేములవాడలోని శంకరమఠంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణుల వేషధారణను ఎగతాళి చేయడం, బ్రాహ్మణ రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం కఠినంగా అరికట్టాలని డిమాండ్ చేశారు.