NLG: మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో మహర్షి దయానంద సేవాశ్రమంలో ఇవాళ పండ్లు పంపిణీ చేశారు. మిర్యాలగూడకు చెందిన సరళ కుమార్తె అర్చన పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమానికి పూనుకున్నారు. కంబాల శివ లీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శివలీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్వేత, పద్మావతి, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.