నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఏపీలోని తిరువూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టడంతో పలువురు స్పల్పంగా గాయపడ్డారు. ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.