NZB: నగరంలోని బీసీ స్టడీ సర్కిల్‌కు సొంత భవనం నిర్మాణం చేయించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో గల బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తుందన్నారు.