కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన కోసం ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ మాజీ కౌన్సిలర్లు పట్టణ ఓటర్లను కోరారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల అభివృద్ధి చేసి రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.