BPT: క్రమశిక్షణ ధైర్యం దేశభక్తికి నిదర్శనం వడ్డే ఓబన్న అని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన తెగువను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.