పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఇవాళ ‘బూత్ నిర్మాణ అభియాన్’ జిల్లా కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఇంఛార్జ్ వీరేల్లి చంద్రశేఖర్ హాజరై దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని పటిష్ఠం చేయడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.