జగిత్యాల: పెద్దపల్లి జిల్లాల కేజీబీవీ, మోడల్ స్కూల్ వసతి గృహాల వార్డెన్లకు నిర్వహించిన 5 రోజుల శిక్షణ ఆదివారంతో ముగిసింది. జిల్లా ఆర్కే కన్వెన్షన్ హాలులో జరిగిన ముగింపు వేడుకలో సైకాలజీ నిపుణుడు శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. విద్యార్థినుల మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవాలని, వార్డెన్లు తమ పని ఒత్తిడిని ఎలా అధిగమించాలో వివరించారు.