KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో నరహరి తీర్థుల ఆరాధన వేడుకలు వైభవంగా ఆదివారం నిర్వహించారు. కర్ణాటక తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆనేగుందిలో పంచామృత అభిషేకాలు, బంగారు కవచాలు, పూల అలంకరణలు చేశారు. సంస్థాన పూజల్లో శ్రీమన్ మూలరాములకు కనకాభిషేకం చేశారు మరియు భక్తులను ఆశీర్వదించారు.