SRD: ధనుర్మాసం సందర్భంగా శ్రీ వైకుంటపురం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథయాత్రలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి రథయాత్ర కార్యక్రమాన్ని ప్రతి ఏడాది సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.