JGL: సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి, కృషి చేస్తానని, వెల్గటూర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైన కూస లక్ష్మన్ అన్నారు. వెల్గటూర్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా కూస లక్ష్మన్ను మండలంలోని సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం, ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయడమే లక్ష్యమన్నారు.