KMR: పెద్దకొడప్ గల్ మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ చైతన్ యాదవ్ ఆధ్వర్యంలో యశోద ఆసుపత్రి వైద్యులచే ఏర్పాటుచేసిన ఉచిత ఆరోగ్య క్యాంపుకు భారీ స్పందనలభించింది. మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు సుమారుగా 300 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుండె సంబంధిత నిపుణుడు డా. రవితేజ పరీక్షలు నిర్వహించారు.