ELR: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సాంగా రోషన్ కుమార్ అన్నారు. ఎండపల్లిలో పీఎంఏజీవై నిధులు రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే డ్రైనేజీ పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామాలలో మురుగునీరు పారుదలకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. నాయకులు పాల్గొన్నారు.