కోనసీమ: అమలాపురం రూరల్ మండలం పేరూరు మంచినీటి చెరువులో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు జారిపడిన నందుల మోక్ష(9) మృతదేహం లభ్యమైంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు కొనసాగించడంతో కొద్ది సేపటి క్రితం మోక్ష మృతదేహం దొరకడంతో ఒడ్డుకు చేర్చారు. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.