KNR: శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో కంటైనర్ బోల్తా పడి రాణవేణి హనుమంతు అనే రైతు దుర్మరణం పాలయ్యారు. వరంగల్ నుంచి పేపర్ లోడుతో వెళ్తున్న కంటైనర్, అండర్ ఫ్లైఓవర్ సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. రోడ్డు విస్తరణ పనుల వద్ద ఈ ప్రమాదం జరగగా, అండర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్న హనుమంతుపై కంటైనర్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు.