BDK: దమ్మపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా, నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.