AP: మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీలలో 200 TMCలు తీసుకునేలా పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును ప్రతిపాదించామని అన్నారు. గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించే హక్కు ఏపీకి ఉందన్నారు. ఏపీ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చన్నారు.