ప్రకాశం: బదిలీ అయి వెళ్లిన సబ్ కలెక్టర్ నాలుగు నెలలుగా బంగ్లాను ఖాళీ చేయలేదని తెలుసుకున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం ఆయన సబ్ కలెక్టర్ బంగ్లాపై ఆరా తీయగా, గతంలో పనిచేసి బదిలీపై వెళ్లిన సబ్ కలెక్టర్ ఇంకా ఖాళీ చేయలేదని అధికారులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన రాజాబాబు వెంటనే ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.