KMR: జిల్లా కేంద్రంలోని మూడు రోజులుగా జరిగిన కస్తూర్బా పాఠశాలల ప్రత్యేక అధికారుల శిక్షణా తరగతులు ఆదివారం ముగిశాయి. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న ప్రత్యేక అధికారులకు పలు అంశాలపై మూడు రోజుల పాటు అవగాహన కల్పించారు. చివరి రోజు ప్రత్యేక అధికారులు పలు రకాల ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.