టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే 28,017 పరుగులతో కుమార సంగక్కర (28,016) రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 782 ఇన్నింగ్స్‌ల్లో 34,357 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.