MBNR: చెన్నైలో నిర్వహించనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ టోర్నీకి పాలమూరు విశ్వవిద్యాలయ పురుషుల జట్టు ఆదివారం బయలుదేరింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఉపకులపతి ప్రొ. జీఎన్.శ్రీనివాస్ యూనిఫాంలు పంపిణీ చేసి అభినందించారు. ఈ నెల 13 నుంచి 19 వరకు సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ పోటీలు జరగనున్నట్లు ఆయన తెలిపారు.