HYD: పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో ఎముకమజ్జ మార్పిడి (Bone Marrow Transplant) సేవలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. థలసీమియా, లుకేమియా వంటి రక్త సంబంధిత వ్యాధులకు బీఎంటీ శాశ్వత చికిత్స అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సదుపాయం ఉండటం వల్ల పేదలకు భారీ ఖర్చు భారం తగ్గుతుందని, అర్హులకు ఆరోగ్యశ్రీ కింద చేస్తారు.