SRCL: రుద్రంగి మండల కేంద్రం నుంచి దసరా నాయక్ తండా వరకు సీసీ అప్రోచ్ రోడ్డు, హై లెవల్ వంతెన నిర్మాణానికి రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయి. దింతో కాంగ్రెస్ నాయకులు, దసరా నాయక్ తండ ప్రజలు నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో ఇంద్రచౌక్ చౌరస్తా వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్ర పటంకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు.