ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. సంక్రాంతి సెలవుల కారణంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి దేవతలను దర్శించుకున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏర్పాట్లను ప్రవేశించారు.