సూర్యాపేట పట్టణంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న నలుగురిపై పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేసినట్లు సీఐ వెంకట్ ఇవాళ తెలిపారు. ఎస్ఐలు శివతేజ్, మహేంద్రనాథ్, ఏడుకొండలు తనిఖీలు చేపట్టారు. షేక్ గౌష్య, తొంగర్ శ్రీనివాస్ సింగ్, లోడంగి సాయి శివ, షైక్ షకీరా కిరాణా షాపుల్లో అమ్ముతున్న 32 మాంజా బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.