AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. సత్యసాయి, అన్నమయ్య జిల్లాలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.