W.G: క్రీడలను ప్రోత్సహించేలా పాలకవర్గాలు మండల కేంద్రాల్లో మినీ స్టేడియం నిర్మించాలని సీపీఎం మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, సభ్యుడు బంకురు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో సీపీఎం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, జూదం వంటి చెడు వ్యసనాలు ప్రోత్సహించడం సరికాదన్నారు.