NLG: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను చిట్యాల వద్ద అడిషనల్ ఎస్పీ రమేష్ ఆదివారం పర్యవేక్షించారు. డీఎస్పీ శివరాం రెడ్డితో కలిసి సిబ్బందికి సూచనలు చేశారు. పోలీసులు 24 గంటలు విధులు నిర్వహిస్తూ.. ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. సాంకేతిక సమస్యతో ఆగిన వాహనాలను వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేశామన్నారు.