W.G: నరసాపురం మెయిన్ రోడ్లో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదివారం పరిశీలించారు. అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరసాపురం పట్టణ ప్రజలకు మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.