JGL: జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లిలో వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీపై తిరుగుబాటు చేసిన సమయంలో, ఓబన్న సైన్యాధిపతిగా నిరుపేద వర్గాలను ఏకం చేశారన్నారు.