KMR: జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో సందాల్ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో పడంపల్లిలోని లాలయ్య దర్గా వద్ద మహా అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి మహిళలు, భక్తులు, గ్రామ పెద్దలు , దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.