KRNL: ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం సాగుతుందని ఆలూరు జేఏసీ నాయకులు తెలిపారు. ఆలూరు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆదివారం 31వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో మెడికల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని సంఘీభావం తెలిపారు. వెనుకబడిన ఆలూరు ప్రాంత అభివృద్ధికి ఆదోని జిల్లాగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని నేతలు డిమాండ్ చేశారు.