GNTR: సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను (07477/07478/07479) ప్రకటించింది. గుంటూరు మీదుగా నడిచే ఈ రైళ్లు రెండు నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.