కేరళలో ఏదో ఒక రోజు కాషాయ జెండా ఎగురుతుందని, బీజేపీ నేత సీఎం అవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో 50 సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం కావాలంటే కేరళ అభివృద్ధి కీలకమని, జాతి వ్యతిరేక శక్తుల నుంచి రాష్ట్రాన్ని ఎన్డీయే మాత్రమే కాపాడగలదని స్పష్టం చేశారు.