NLG: దేవరకొండ సీపీఐ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈనెల 18న ఖమ్మంలో సీపీఐ 100 సంవత్సరాల సందర్బంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.