ప్రకాశం: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా విడుదల కానున్న సందర్భంగా కనిగిరి లోని శ్రీనివాస థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. థియేటర్ల వద్ద మెగా అభిమానులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సినిమా ధియేటర్ వద్ద భారీ కటౌట్లు సైతం ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.