న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదిన రోహిత్.. భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం గిల్‌కు తోడుగా కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.