W.G: అంధుల జీవితాల్లో జ్ఞాన దీపం వెలిగించిన మహానుభావుడు సర్ లూయీ బ్రెయిలీ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం జరిగిన సర్ లూయీ బ్రెయిలీ 217 జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అంధులతో కలిసి మంత్రి కేక్ కట్ చేసి వారికి తినిపించారు. అంధులకు లూయిస్ లిపి ఒక స్ఫూర్తిగా ఉందని నిమ్మల అన్నారు.