PPM: గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు మన దేశానికే గర్వకారణమని, గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గుమ్మలక్ష్మిపురంలో ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘ఆదివాసీ సంస్కృతి-సాంప్రదాయ యువ సమ్మేళనం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.