SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని పీవైఎల్ రాష్ట్ర నాయకుడు బండి రవి డిమాండ్ చేశారు. నిరుద్యోగులపై లాఠీచార్జీలు, అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగులను వంచిస్తోందని, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని సూర్యాపేటలో ఆయన డిమాండ్ చేశారు.