E.G: రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి శ్రీకారం చుట్టారు. ఆదివారం పొట్టిలంక, కడియపుసావరం గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి, అలాగే దుళ్ల-మడికి ప్రధాన రోడ్డు మరమ్మతు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కడియపులంకలో చర్చి అభివృద్ధి కోసం తన వంతుగా రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.