VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు హరీష్ శంకర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కే.తిరుమలేశ్వరరావు స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి దర్శనం కల్పించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను, చిత్రపటం అందజేశారు.