అనంతపురం పట్టణంలోని లలిత కళాపరిషత్‌లో స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలకు హిందూపురం ఎంపీ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మంత్రి సవిత, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు.