విజయనగరం: జిల్లాలో ఇవాళ నాన్వెజ్ ధరలు స్వల్పంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950 నుంచి రూ.1000 వరకు ఉండగా, చికెన్ (స్కిన్లెస్) కేజీ రూ.300కు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ చికెన్ కేజీ రూ.280గా, శొంఠ్యాం కోడి కేజీ రూ.310గా కొనసాగుతోంది. డజన్ గుడ్లు రూ.90గా ఉన్నాయి. గత వారంతో పోలిస్తే దాదాపు అన్ని రకాల నాన్వెజ్ ధరలు కొద్దిగా పెరిగాయని వినియోగదారులు చెబుతున్నారు.