సాధారణంగా జనవరి 13న భోగి, 14న సంక్రాంతి పండగలు వస్తుంటాయి. అయితే, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం (మకర సంక్రమణం) అర్ధరాత్రి దాటినప్పుడు లేదా సాయంత్రం వేళల్లో జరిగినప్పుడు తిథి లెక్కల ప్రకారం పండగ తేదీ ఒక రోజు అటు ఇటు మారుతుంది. ప్రముఖ పంచాంగ కర్తల ప్రకారం.. జనవరి 14న భోగి, మరుసటి రోజు జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.