ADB: సాత్నాల మండలం దుబ్బగూడా ఆదివాసీల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అధికారుల అడ్డంకులను తొలగించి నిర్మాణ పనులు జరిగేలా చూడాలని ఎస్పీ అఖిల్ మహాజన్ను అఖిలపక్ష నాయకులు కోరారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామానికి చెందిన లేతుబాయి ఒక ఎకరం భూమిని దానం చేశారన్నారు. అటవీ శాఖ అధికారులు ఆ భూమి అటవీ పరిధిలోకి వస్తుందని నిర్మాణాలను అడ్డుకున్నారన్నారు.